31, మార్చి 2023, శుక్రవారం

ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో కీలక ఘట్టం ఆరంభం

కడప: ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి (Ontimitta Sri kodandaswamy Temple) బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ధ్వజారోహణం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ధ్వజారోహణ కార్యక్రమాన్ని టీటీడీ (TTD), ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా.. నిన్న సాయంత్రం కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం అర్చకుల వేదమంత్రాల నడుమ అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి కంకణధారణ చేశారు. అయితే దేశ్యాప్తంగా శ్రీరామనవి రోజు శ్రీసీతారాముల కళ్యాణం జరుగుతుండగా.. ఇక్కడ మాత్రం చైత్ర పౌర్ణమి రోజు కళ్యాణవేడుక జరుగుతుంది. ఏప్రిల్ 5న కోదండరామ స్వామి ఆలయంలో శ్రీసీతారాముల కళ్యాణం జరుగనుంది. ఇందుకు కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

COURTESY : ANDHRAJYOTHY

KUPPA CHANDRA SEKHAR

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన, సమీక్ష జరిపారు. అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడారు. మార్చి 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు, స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. నెలరోజుల ముందు నుంచే టీటీడీ ఈ పనులను ప్రారంభించిందని వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు.

కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి రెండు వారాల్లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్, నాగేశ్వరరావు విద్యుత్ విభాగం ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఈ ఈ శ్రీమతి సుమతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, డిఎఫ్ఓ శ్రీనివాస్, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ డిఈ చంద్రశేఖర్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు. అంతకు ముందు జేఈవో వీరబ్రహ్మం రాజంపేట లోని 108 అడుగుల తాళ్ళపాక అన్నమాచార్య విగ్రహం ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

10, ఏప్రిల్ 2022, ఆదివారం

Kodandaramuni Ramuni Bramhotsavaalu

 Ontimitta Brahmotsavalu: వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా ఏకాంతంగానే స్వామివారి ఉత్సవాలు నిర్వహించిన తితిదే..ఈసారి అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయించింది. శనివారం రాత్రి అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. ఈనెల19న పుష్పయాగంతో ముగుస్తాయి. 10వ తేదీన ధ్వజారోహణను ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన ఆగమశాస్త్ర పండితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. 15న సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

11వ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలానగరి ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి. త్రేతాయుగంలో రామలక్ష్మణులు వనవాసం సందర్భంగా ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చినపుడు... రుషుల యజ్ఞాలకు రాక్షసులు భంగం కల్గించేవారు. రాక్షసులను సంహరించి రుషుల యజ్ఞాన్ని జయప్రదం చేసిన రామలక్ష్మణులు కోదండరాముడి అవతారంలో కనిపిస్తారని ప్రతీతి. ఆంజనేయస్వామి శ్రీరాముడికి పరిచయం కాకముందే ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై నిర్మించారనేది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా కనిపించదు.

రాష్ట్ర విభజన తర్వాత 2015లో ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడే దేవదాయశాఖ బహిరంగ ప్రదేశంలో సీతారాముల కల్యాణం నిర్వహించగా... 2016 నుంచి ఆ బాధ్యతను తితిదేకి అప్పగించారు. పురాణాల ప్రకారం చంద్రుడు చూసేలా ఒంటిమిట్టలో శ్రీరాముడు కల్యాణం చేసుకుంటాడని... అందులో భాగంగానే రాత్రి సమయంలో అక్కడ కల్యాణం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదీ బహిరంగ ప్రదేశంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమేరకు 52 ఎకరాల విస్తీర్ణంలో ... 52 వేల మంది కూర్చోని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణ ఘట్టాలను తిలకించేలా వేదికను తితిదే సిద్ధం చేసింది. శాశ్వత కల్యాణ వేదిక నిర్మించిన తర్వాత జరుగుతున్న తొలి కల్యాణ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 15న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారి కల్యాణం జరుగనుంది. 2 కోట్ల రూపాయలను ఉత్సవాలకు తితిదే వెచ్చిస్తోంది.- సుమతి, తి.తి.దే. ఈఈ

ఒంటిమిట్ట వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం ముందు నుంచే డాగ్ స్కాడ్​తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ అన్బురాజన్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

20, ఏప్రిల్ 2021, మంగళవారం

శ్రీరామ నవమితో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలుJ

 20.04.2021

ఒంటిమిట్ట: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. ఈనెల 21వ తేదీ నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాల్సి ఉంది. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట ఆలయాన్ని మే 15వ తేదీ వరకు మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆపాలని అధికారులను ఆదేశించింది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

26, మే 2015, మంగళవారం

సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడిన ప్రసిద్ధ ఆలయం

సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడిన ప్రసిద్ధ ఆలయం

Posted: 02/28/2015 05:52 PM IST
Kodanda ramalayam history imambaig well
భారతదేశంలో కొలువై వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కోదండ రామాలయం ఒకటి! ఇది ఎంతో ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఇంకా చెప్పుకోదగ్గ ఎన్నో విశేషాలు ఈ ఆలయంలో సంతరించుకుని వున్నాయి.
స్థలపురాణం :
రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా వున్న సమయంలో విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. అలాంటి సందర్భమే ‘సీతారామ కల్యాణం’ జరిగాక కూడా ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి దుష్టశిక్షణ కోసం రాముణ్ణి ప్రార్థించగా.. ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
ఆలయ విశేషాలు :
1. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని విగ్రహాలు ఈ ఆలయంలో చెక్కబడ్డాయి. అంతేకాదు.. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం దేశంలో ఇదొక్కటే.
2. ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
3.  16వ శతాబ్దంలో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
4. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ఇమాంబేగ్ బావి కథనం :
1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ రాజుకు ప్రతినిథిగా ఇమాంబేగ్ చెలామణీ అయ్యాడు. ఒక సందర్భంలో ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన భక్తులను.. ‘మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?’’ అని ప్రశ్నించాడు. అందుకు భక్తులు.. ‘‘చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు’’ అని సమాధానమిచ్చారు. దాంతో ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చింది.
ఆ సమాధానం విన్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే స్వామి భక్తుడిగా మారిపోయాడు. అలా స్వామి భక్తుడిగా మారిపోయిన ఇమాంబేగ్... అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ‘ఇమాంబేగ్ బావి’గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం.

- See more at: http://www.teluguwishesh.com/anveshana/234-anveshana/61350-kodanda-ramalayam-history-imambaig-well.html#sthash.lIWZCr24.dpuf

22, మార్చి 2010, సోమవారం

చిరునవ్వుల వరమందించే సీతరమాలక్షంనులు... స్వామిభక్తికి ప్రతీకగా చేతులు జోడించి ఆ ముగ్గురికి నమస్కరిస్తున్న ఆంజనేయుడు...ఏ రామాలయంలోనైనా కనిపించే ద్రుశ్యమిదీ.... కానీ ఆ నీలమేఘశ్యాముని పాదాలచెంత అంజనీపుత్రుడు లేని రామాలయాన్ని ఎవరైనా ఊహి౦చగలరా....! దేశం మొత్తం మీద ఆలాంటి ఆలయం ఒక్కటే ఉంది. అదిఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కడప జిల్లా ఒంటిమిట్ట లోనే .............
శ్రీ రామ రామరామేతి ,రమే రామే మనోహరమే... రాముడి మనోహరత్త్వానికి నిలువెత్తు ప్రతీక కడపజిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయ ప్రాంగణం. ఈ రాముడిని కొలిచిన ఇద్దరు గజదొంగలు ఆ వృతిని మానుకొని నిజాయితీ పరులుగా బతికారు. ఒంటడు, మిట్టడు అనే ఆ ఇద్దరి దొంగల పేరిట ఈ గ్రామానికి పేరు వత్చ్చినదని చెబుతారు.
ఆలయ ప్రాంగణం:
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ ముఖద్వారం ఎత్తు ౧౬౦ అడుగులు కాగ, ఇక్కడ కనిపించే శిల్పకళ సంపదకు యెనలేని విశిష్టత ఉంది.ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయంలో ఎకశిలలపై చెక్కిన కలఖండల్అ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. పదహారవశతాబ్దంలో ఇక్కడికి వచ్చిన ఫ్రెంచి యాత్రికుడు తవర్నిఎర్ భారత దేశ గొప్ప కట్టడాలలో ఒంటిమిట్ట వోక్కటని దేశంలోని అతి పెద్ద గాలిగోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒక్కటని రాసుకున్నాడు.
స్థలపురాణం:
మ్రుకుండ మహర్షి, శృంగి మహర్షులు యాగా రక్షణ కోరగా ఆ స్వామి సీత ,లక్ష్మణ సమేతుడై అంబులపొది,పిడిబాకు,కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగా రక్షణ చేశాడట. అందుకుప్రతిగా ఆ మహర్షులు సీతరామలక్ష్మనుల విగ్రహాలను ఏకశిలపై చెక్కి పూజించి తమ కృతజ్నత భావాన్ని తెలుపుకున్నారట. అనంతరము జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసి స్వామిని అర్చించారని ప్రతీతి. జంట తీర్థాలు :భర్తతో పాటు ఈ ప్రాంతానికి వచ్చిన సీతాదేవి చుట్టుపక్కల ఎక్కడా నీళ్ళు లేక అందరు అల్లాడుతున్నారని గ్రహించి రాములవారికి విన్నవిన్చేనత. అప్పుడు రామాలక్ష్మనులు పాతాల గంగమ్మ పైపైకి ఉబికివచ్చేలా బాణాలు వేశారట. వారిరువురి బానాలవల్ల ఏర్పడిన తీర్థాలను రామ, లక్షమన తీర్థాలు గా భక్తులు పిలుచుకుంటారు.
ఎందరో మహానుబహవులు :
పోతన, అన్నమయ్య, వీర బ్రమ్హేంద్ర గారు యాలా ఒకరా ఇద్దరా ఎందరో స్వామి వారిని దర్శించు కున్నారని చెబుతారు స్థానికులు. పోతన తన భాగవతాన్ని ఒంటిమిట్ట రాముడికి అంకితం చేశారని ప్రతీతి. అలాగే అన్నమయ్య " జయ జయ రామ సమరవిజయ రామ " అంటూ కొలిచారు. బ్రమ్హంగారు స్వామిని దర్శించుకున్నాకే కాలజ్ఞానం రాశారని ప్రతీతి.వాల్మీకి రామాయణాన్ని తెలుగు లోకి తర్జిమ చేసిన అవిల కొలను సుబ్బారావు టెంకాయ చిప్ప చేతబట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో పది లక్షల విలువైన ఆభరణములు చేయించడం విశేషం. ఈయన రచించిన "టెంకాయ చిప్ప శతకం" ప్రఖ్యాతిగాంచింది.
పిలిచినా పలికే స్వామి:
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాలలో ఇమంబెగ్ బావి వొకటి. ఈయన పదహారు వందల నలవి లో కడపను పాలించిన నభీఖాన్ ప్రతినిధి. ఒకసారి ఇక్కడి భక్తులను 'మీ దేవుడు పిలిస్తే పలుకుతాడ ' అని ప్రశ్నించడం జరిగింది. చిత్తశుద్ధి ఉంటే చాలని వారు అనడంతో ఆయన మూడు సార్లు రాముని పిలిచాడట. అందుకు ప్రతిగా మూడుసార్లు 'ఓ' అని సమాధానం రావడంతో ఆయన ఆచ్చర్య పోయి స్వామికి భక్తుడిగా మారి ఇక్కడ బావి తవ్వించాడు. దానినే ఇప్పుడు ఇమంబీగ్ బావిగా వ్యవహరిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించు కొని ముస్లింలు కూడా స్వామిని దర్శించుకుని వేలుతుండడం విశేషం.
స్వామిని దర్శించి తరిస్తారని ఆశిస్తూ......
మీ
చంద్ర శేఖర్ .కుప్పా

27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

వొంటిమిట్ట శ్రీ కోదండరామ దేవస్తానం కడపకు 25కిమీ ...
వొంటిమిట్ట శ్రీ కోదండరామ దేవస్తానం కడపకు 25కిమీ కడప-చెన్నై ప్రధాన రహదారిలో ఉన్నది. వొంటిమిట్ట కు ఏకశిలా నగరం అని పేరు. ఓకీ శిలపై రామ, లక్ష్మణ, సీతా దేవి విగ్రహాలు చెక్కడం వల్ల ఆ పేరు వట్చింది. ఈ దేవాలయం ను అనేకమంది రాజులు అభివృద్ది పరిచిరి. వారిలో మట్టి రాజులు , చోళులు, క్రిష్ణదేవరాయులు ముఖ్యులు. వొంటిమిట్ట కోదండరామ దేవస్తానం ను రెండవ భద్రాది గా వాడుకలో ఉన్నది. ఈ దేవాలయంకు ఆస్తులు సమకూర్చినవారిలో వావిలకొలను సుబ్బారావు గారు ప్రధములు. వీరి నివాసమునే నేడు శృంగిశైలం గా పిలవబడుతున్నది. వొంటిమిట్ట కోదండరాముని బ్రహోస్తావాలు శ్రీ రామ నవమి తర్వాత 9 రోజులవరకు కొనసాగుతాయి. తొమ్మిదిరోజులు తొమ్మిది ఉత్సవ విగ్రహాలైన శేష, హంస, హనుమంతు, గరుడ, ఏనుగు వాహనములపై పురవీధులలో సీతమ్మ వారితో శ్రీరాముడు ఊరేగుతాడు. గరుడ సేవ, కళ్యాణ వేడుకలు వేడుకగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్య క్రమాలు టి టి డి వారిచే నిర్వహింపబడతాయి. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలలనుంచి ప్రజలు విరివిగా పాల్గొంటారు. స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరపున ఏం. ఎల్.ఏ . లేదా ఏం. పి ద్వార అందచేయబడుతాయి. ఈ బ్లాగు కు ఎవరైనా మీ అభిప్రాయాలను తెలియచేయవచును.