22, మార్చి 2010, సోమవారం

చిరునవ్వుల వరమందించే సీతరమాలక్షంనులు... స్వామిభక్తికి ప్రతీకగా చేతులు జోడించి ఆ ముగ్గురికి నమస్కరిస్తున్న ఆంజనేయుడు...ఏ రామాలయంలోనైనా కనిపించే ద్రుశ్యమిదీ.... కానీ ఆ నీలమేఘశ్యాముని పాదాలచెంత అంజనీపుత్రుడు లేని రామాలయాన్ని ఎవరైనా ఊహి౦చగలరా....! దేశం మొత్తం మీద ఆలాంటి ఆలయం ఒక్కటే ఉంది. అదిఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కడప జిల్లా ఒంటిమిట్ట లోనే .............
శ్రీ రామ రామరామేతి ,రమే రామే మనోహరమే... రాముడి మనోహరత్త్వానికి నిలువెత్తు ప్రతీక కడపజిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయ ప్రాంగణం. ఈ రాముడిని కొలిచిన ఇద్దరు గజదొంగలు ఆ వృతిని మానుకొని నిజాయితీ పరులుగా బతికారు. ఒంటడు, మిట్టడు అనే ఆ ఇద్దరి దొంగల పేరిట ఈ గ్రామానికి పేరు వత్చ్చినదని చెబుతారు.
ఆలయ ప్రాంగణం:
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ ముఖద్వారం ఎత్తు ౧౬౦ అడుగులు కాగ, ఇక్కడ కనిపించే శిల్పకళ సంపదకు యెనలేని విశిష్టత ఉంది.ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయంలో ఎకశిలలపై చెక్కిన కలఖండల్అ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. పదహారవశతాబ్దంలో ఇక్కడికి వచ్చిన ఫ్రెంచి యాత్రికుడు తవర్నిఎర్ భారత దేశ గొప్ప కట్టడాలలో ఒంటిమిట్ట వోక్కటని దేశంలోని అతి పెద్ద గాలిగోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒక్కటని రాసుకున్నాడు.
స్థలపురాణం:
మ్రుకుండ మహర్షి, శృంగి మహర్షులు యాగా రక్షణ కోరగా ఆ స్వామి సీత ,లక్ష్మణ సమేతుడై అంబులపొది,పిడిబాకు,కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగా రక్షణ చేశాడట. అందుకుప్రతిగా ఆ మహర్షులు సీతరామలక్ష్మనుల విగ్రహాలను ఏకశిలపై చెక్కి పూజించి తమ కృతజ్నత భావాన్ని తెలుపుకున్నారట. అనంతరము జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసి స్వామిని అర్చించారని ప్రతీతి. జంట తీర్థాలు :భర్తతో పాటు ఈ ప్రాంతానికి వచ్చిన సీతాదేవి చుట్టుపక్కల ఎక్కడా నీళ్ళు లేక అందరు అల్లాడుతున్నారని గ్రహించి రాములవారికి విన్నవిన్చేనత. అప్పుడు రామాలక్ష్మనులు పాతాల గంగమ్మ పైపైకి ఉబికివచ్చేలా బాణాలు వేశారట. వారిరువురి బానాలవల్ల ఏర్పడిన తీర్థాలను రామ, లక్షమన తీర్థాలు గా భక్తులు పిలుచుకుంటారు.
ఎందరో మహానుబహవులు :
పోతన, అన్నమయ్య, వీర బ్రమ్హేంద్ర గారు యాలా ఒకరా ఇద్దరా ఎందరో స్వామి వారిని దర్శించు కున్నారని చెబుతారు స్థానికులు. పోతన తన భాగవతాన్ని ఒంటిమిట్ట రాముడికి అంకితం చేశారని ప్రతీతి. అలాగే అన్నమయ్య " జయ జయ రామ సమరవిజయ రామ " అంటూ కొలిచారు. బ్రమ్హంగారు స్వామిని దర్శించుకున్నాకే కాలజ్ఞానం రాశారని ప్రతీతి.వాల్మీకి రామాయణాన్ని తెలుగు లోకి తర్జిమ చేసిన అవిల కొలను సుబ్బారావు టెంకాయ చిప్ప చేతబట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో పది లక్షల విలువైన ఆభరణములు చేయించడం విశేషం. ఈయన రచించిన "టెంకాయ చిప్ప శతకం" ప్రఖ్యాతిగాంచింది.
పిలిచినా పలికే స్వామి:
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాలలో ఇమంబెగ్ బావి వొకటి. ఈయన పదహారు వందల నలవి లో కడపను పాలించిన నభీఖాన్ ప్రతినిధి. ఒకసారి ఇక్కడి భక్తులను 'మీ దేవుడు పిలిస్తే పలుకుతాడ ' అని ప్రశ్నించడం జరిగింది. చిత్తశుద్ధి ఉంటే చాలని వారు అనడంతో ఆయన మూడు సార్లు రాముని పిలిచాడట. అందుకు ప్రతిగా మూడుసార్లు 'ఓ' అని సమాధానం రావడంతో ఆయన ఆచ్చర్య పోయి స్వామికి భక్తుడిగా మారి ఇక్కడ బావి తవ్వించాడు. దానినే ఇప్పుడు ఇమంబీగ్ బావిగా వ్యవహరిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించు కొని ముస్లింలు కూడా స్వామిని దర్శించుకుని వేలుతుండడం విశేషం.
స్వామిని దర్శించి తరిస్తారని ఆశిస్తూ......
మీ
చంద్ర శేఖర్ .కుప్పా