20, ఏప్రిల్ 2021, మంగళవారం

శ్రీరామ నవమితో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలుJ

 20.04.2021

ఒంటిమిట్ట: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. ఈనెల 21వ తేదీ నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాల్సి ఉంది. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట ఆలయాన్ని మే 15వ తేదీ వరకు మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటించింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆపాలని అధికారులను ఆదేశించింది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.